15 April, 2026 | 8:49 AM

ఆలయ నిర్మాణానికి రూ.51 వేల విరాళం

29-10-2025 06:21 PM

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సంతోశ్ మేస్త్రీ పాత బస్టాండ్ వద్ద గల హనుమాన్ మందిరం పున: నిర్మాణం కోసం బుధవారం రూ.51,000 విరాళంగా అందజేశారు. సంఘ సేవలో చురుకుగా ఉండే సంతోశ్ గతంలోనూ ఆలయాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణ, సాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.