22 August, 2026 | 2:46 AM

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

22-08-2026 01:03 AM

సూర్యాపేట (మఠంపల్లి), ఆగస్టు 21(విజయక్రాంతి) : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరమని మఠంపల్లి మండలంలోని అల్లిపురం గ్రామ సర్పంచ్ బోగాల జ్యోతి పిచ్చిరెడ్డి, కాల్వపల్లి తండా సర్పంచ్ మాలోతు సక్రు నాయక్ లు అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం లబ్దిదారులకు అందజేశారు. దీనిలో భాగంగా బజ్జూరి గురవయ్య కు రూ.36 వేలు, కొమ్మనబోయిన బ్రహ్మయ్యకు రూ.19 వేలు, పట్టేటి రపేలు రూ.60వేల విలువగల చెక్కులను అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెక్కుల మంజూరు కి సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్లిపురం గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లికంటి నాగేశ్వరావు, ఉపసర్పంచ్ మాలిరెడ్డి వీరారెడ్డి తదితరు పాల్గొన్నారు.