calender_icon.png 20 May, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగుల సహాయకులకు అన్నదానం

20-05-2025 12:28:48 AM

అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో..

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సయ్యద్ మాజీదుల్లా హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో  ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసు పత్రి ప్రాంగణంలో సోమవారం సుమారు 700 మంది పేద రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. 

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి పర్వతాలు, ములుగు జిల్లా అధ్యక్షుడు పోలు రాజు, హైదరాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కెఆర్ రాజ్‌కుమార్, హైదరాబాద్ జిల్లా సభ్యుడు ముకీమ్ ఖురేషి, శ్రీధర్‌నాయుడు, టీఎన్జీవో క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షుడు బీ శివకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్, హైదరాబాద్ జిల్లా ఏపీఆర్‌ఓ మహ్మద్ వహీద్, మహ్మద్ ముస్తఫా షరీఫ్, మహ్మద్ హబీబ్ చావుష్, మహ్మద్ అబ్దుల్ ముస్తఫా పాల్గొన్నారు.

కీర్తిశేషులైన తల్లిదండ్రుల పేరు మీద తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగుల సహకారంతో అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు ముజీబ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.