calender_icon.png 20 May, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో ముగిసిన భూభారతి సదస్సులు

20-05-2025 12:30:28 AM

కొండాపూర్ మే  19 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం పైలట్ మండలంగాఎంచుకొని ఈనెల 4 న తోగర్ పల్లిలో గ్రామంలోప్రారంభమై సోమవారం 18వ తేదీన మల్కాపూర్ గ్రామంలో భూ భారతి సదస్సులు ముగిశాయి. గ్రామాల వారిగా తొగర్పల్లి125,అలియాబాద్35, గారకుర్తి31, గిర్మాపూర్10, గోపులారం 51,

హరిదాస్పూర్ 45, తేర్పోల్105, మాచేపల్లి22, గడిమల్కాపూర్14, గొల్లపల్లి55, మునిదేవునిపల్లె143, గుంతపల్లి38, సి.కోనాపూర్68, గంగారం86, మన్సన్పల్లి61, మహమ్మదాపూర్183, సైదాపూర్148, మరేపల్లి54, కుతుబ్షాపేట్16, అనంతసాగర్100, కొండాపూర్162,మల్లేపల్లి67, మల్కాపూర్97 మొత్తం 1716 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తాసిల్దార్ అశోక్ పత్రిక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ కొండాపూర్ మండలం భూ భారతి పైలేట్ గ్రామంగా ఎంచుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. గ్రామాలలో భూ భారతి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి 30 రోజుల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. గ్రామాలలో రైతులు ఓపికగా దరఖాస్తులు చేసుకున్నందుకు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వచ్చిన ప్రతి దరఖాస్తులు స్వీకరించిన రెవెన్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.