20-05-2025 12:28:10 AM
ఆలయ నిర్మాణానికి రూ.60 లక్షల భారీ విరాళం
పటాన్ చెరు, మే 19 : ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భారీ విరాళాన్ని అందజేశారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి విశ్వబ్రాహ్మణుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే రూ.60లక్షల విరాళాన్ని అందజేశారు. సోమవారం ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు దైవభక్తిని అలవర్చుకోవా లన్నారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలో చేపట్టే ఆలయ నిర్మాణాలకు సహకారం ఉంటుందన్నారు. చర్చిలు, మసీదుల నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో విలువైన స్థలం ఆలయ నిర్మాణానికి కేటాయించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, శ్రీధర్ చారి, పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఇంద్రా రెడ్డి, శ్రీశైలం చారి, గోపాల్ చారి, ప్రకాష్ చారి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.