10 April, 2026 | 8:00 PM

Breaking News

శ్రీ శ్రీ శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి విరాళం

10-04-2026 06:26 PM

శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెద్దగొని జిన్నారం శివకుమార్ గౌడ్

శివంపేట్,(విజయక్రాంతి): ప్రముఖ హైకోర్టు న్యాయవాది, సంఘ సేవకుడు, శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని జిన్నారం శివ కుమార్ గౌడ్ తన వంతు సహాయంగా భీమ్లా తండాలో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి విగ్రహ ప్రతిష్ట  పూజ కార్యక్రమాలకై రూ. 60000/- విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో తండా నాయక్  బుచ్చ నాయక్ , సర్పంచ్, లక్ష్మి దుర్గ నాయక్, మాజీ సర్పంచ్ చెన్నా నాయక్, తండా నాయకులు చెన్నా నాయక్,రమేష్ నాయక్, నరేష్ నాయక్  పాల్గొన్నారు.తండా ప్రజలందరు కూడ శివకుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.