22 May, 2026 | 3:05 PM

ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి: వినోద్

20-04-2024 01:39 AM

కరీంనగర్, ఏప్రిల్19 (విజయక్రాంతి) : లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌ను గెలిపిస్తే పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకవుతారని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్‌లోని 1వ డివిజన్ పరిధి తీగలగుట్టపల్లిలోని విజేత గ్రీన్ హోమ్స్ కాలనీవాసులతో ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ తో కలిసి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్‌కు ఏం చేయలేకపోయారని, ఎన్నికలు వస్తేనే ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌ను వెయ్యి కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీగా చేశారని పేర్కొన్నారు. 

అనంతరం ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడు తూ.. ఐదేళ్లలో బండి సంజయ్ ఏం చేయలేకపోయారని, నన్ను పార్లమెంట్‌కు పంపిస్తే ప్రజల గొంతుక అవుతాన న్నారు. ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, కార్పొరేటర్ కల్యాణి, సాగర్, కిష్టయ్య, శంకరయ్య, కరుణాకర్ గుప్త, వాసుదేవరావు, ప్రభాకర్, మల్హర్ రావు, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.