calender_icon.png 16 July, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ సైట్లతో కొంప కొల్లేరు!

16-07-2025 12:06:25 AM

  1. తెలియని లింకులు క్లిక్ చేస్తే అకౌంట్ గుల్లే

అప్రమత్తంగా లేకుంటే నష్టమే

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ఘటనలు

ఖమ్మం, జులై 15 (విజయ క్రాంతి ):ఒక పక్క ఒక్క ఎస్‌ఎంఎస్ లో వచ్చిన లింక్ ని  క్లిక్ చేస్తే అకౌంట్ లోని డబ్బులన్నీ కొట్టేస్తారు. ఇంకో పక్క ఏదయినా లైసెన్స్ ల కోసమని ఆన్లైనలో అప్లై చేస్తే అక్కడ ఫేక్ సైట్ లతో డబ్బులు కొట్టేస్తారు కేటుగాళ్లు. 

రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ తో ఎంత ప్రయోజనం అయితే ఉందో, వాటితో కొంత ఇబ్బంది కూడా లేకపోలేదు. వివరాల్లోకెళ్తే మంగళవారం తల్లాడ కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి వెంకటలక్ష్మి పద్మావతి ఎంట్ర్పజెస్ పేరు తో  ఫుడ్ లైసెన్స్ తీసుకునేందుకు ఆన్లైన్లో అప్లై చేశారు.  ఫుడ్ లైసెన్స్ కోసమని ఆన్లైన్ లో ప్రయత్నం చేయగా,  ఫుడ్ లైసెన్స్ పోర్టల్. ఓఆర్జి అనే ఒక వ్బుసైటు వచ్చింది. అందులో ఫుడ్ లైసెన్స్ కోసం అని ఒక లింక్ ఉండగా దానిపై క్లిక్ చేశారు.

కావలసిన వివరాలన్నీ నమోదు చేయగా అ నంతరం రెండు వేల రూపాయలు పే చేయాల్సిందిగా ఆ సైట్లో సూచించబడింది. దీంతో సదరు వ్యక్తి రెండూవేలు కార్డు ద్వారా పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేశారు.  అప్లికేషన్ సబ్మిట్ చేయబడిందని చెల్లించిన డబ్బులకి ఓ రసీదు ఇమెయిల్ లో, ఎస్ ఎం ఎస్ వచ్చింది. ఈమెయిల్ లో వచ్చిన రిసిప్ట్,  ఎస్‌ఎంఎస్ ద్వారా సదరు వ్యక్తి తెలిసిన వా రి ద్వారా ఖమ్మంలోని  ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సంప్రదించగా అప్పుడు అసలు విషయం బయటపడింది. అది ఒక ఫేక్ సైట్ అని, అందులో సబ్మిట్ చేసిన వారికి కార్యాలయానికి ఏ విధమైన సంబంధం ఉండదని తెలిపారు.

ఈ విషయంపై షాక్ అయినా సదరు వ్యక్తి, మరొకరు తనలా మోసపోకూడదని ఈ విషయంను విజయ క్రాంతి ప్రతినిధికి ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపారు. ఈ విషయాన్ని  పేపర్లో ప్రచురిం చవలసిందిగా కోరారు. దీంతో మరెవరు  ఈ విధంగా మోసపో కుండా ఉంటారని అన్నారు. 

 ఫేక్ కాళ్లతో కేటుగాళ్లు

 మీ పేరు ట్రూ కాలర్ లో చూస్తారు, మీకు కాల్ చేస్తారు. బాగున్నారా అండి నేను అని ఒక పేరు చెప్తారు. ఎవరైనా పేరు పిలవగానే మనకు తెలిసిన వారు ఏమో అని ఆలోచిస్తుండగా, గతంలో మిమ్మల్ని నేను కలిశాను, అని మాటలు కలుపుతారు. కొన్ని విషయా లు మాట్లాడిన తర్వాత నా దగ్గర ఒక విలువైన వస్తువు ఉంది. డబ్బులు అవసరం ఉం డటంతో దాన్ని మీకు నేను తక్కువ ఖరీదుకే ఇద్దాము అనుకుంటున్నాను అని అంటారు.

ఏమి వస్తువు అని అడగగా బంగారపు వ స్తువు అని,అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండడంతో సగం రేటుకే అమ్ముతు న్నానని చెబుతారు. నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నానని, వచ్చేందుకు కూడా డబ్బు లు లేవని, కొంత డబ్బులు మీరు ఇచ్చినట్టు అ యితే నేను సగం దూరం ఆ వస్తువు తీసుకొని వస్తాను. మీరు సగం దూరం రండి అని నమ్మ పలుకుతారు. ఇటువంటి మాటలతోటే ఈమధ్య జిల్లాలోని కొందరికి ఫేక్ కాల్స్ వస్తున్నాయి.

ఖమ్మం లోని పుట్టకోటకు  చెందిన వేణు అనే వ్యక్తికి ఈ విధమైన కాల్ వచ్చింది. నీ అడ్రస్ తెలుపు పోలీసువారికి నీ అడ్రస్ అందజేస్తానని గట్టిగా మాట్లా డడంతో ఆ  కేటుగాడు కాల్ చేయటం మానేశాడు. మరో వ్యక్తికి మరో కేటుగాడు దగ్గర నుంచి ఈ విధమైన కాల్ రావడంతో సదరు వ్యక్తి ఆ కేటుగాడి కాల్ ని బ్లాక్లిస్టులో పెట్టా రు. ఇటువంటి కాల్స్ ని నమ్మినట్టయితే నిలువునా మోసపోవాల్సి వస్తది.

కార్యాలయం కి వచ్చి సబ్మిట్ చేయండి

ఫుడ్ లైసెన్స్ కోసం తమ కార్యాలయానికి వచ్చి అవసరమైన డాక్యుమెం ట్లు సబ్మిట్ చేసినట్లయితే లైసెన్స్ వెం టనే అందజేస్తాము. ఫేక్ సైట్లు తో అప్రమత్తంగా ఉండాలి, ఒకవేళ మీరు ఆన్లై న్లోనే అప్లై చేయదలిస్తే ఎఫ్‌ఓఎస్సి ఓఎస్. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ. జిఓవి. ఐఎన్ లో అప్లై చేయాలి.

కిరణ్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఖమ్మం జిల్లా