15 April, 2026 | 12:08 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

అనుమతులు లేని శ్రీ చైతన్య పాఠశాలలో పిల్లలను చేర్చి మోసపోవద్దు

04-06-2025 07:31 PM

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల నాగరాజు..

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో ఉన్న అనుమతులు లేని శ్రీ చైతన్య పాఠశాలలో పిల్లల్ని చేర్చి తల్లిదండ్రులు మోసపోవద్దని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల నాగరాజు(SFI District Vice President Vemula Nagaraju) అన్నారు. గతం సంవత్సరం కూడా హడావుడిగా ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల ప్రారంభించి వందల సంఖ్యలో అడ్మిషన్లు తీసుకొని పేద, మధ్యతరగతి తల్లిదండ్రులను మోసం చేసిన పరిస్థితి ఉందన్నారు. ఈ సంవత్సరం కూడా ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్ వర్క్ ప్రారంభించి అడ్మిషన్లు తీసుకుంటున్నా జిల్లా విద్యాధికారి స్పందించడం లేదన్నారు. గతంలో ఉన్న జిల్లా విద్యాధికారి శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలపై కేసు నమోదు చేసి ఆ పాఠశాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. 

ప్రస్తుతం ఉన్న జిల్లా విద్యాధికారి వచ్చిన తర్వాత చైతన్య పాఠశాలపై ఎస్ఎఫ్ఐగా ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటామని మాటలు చెప్పి దాటీవేస్తున్న పరిస్థితి ఉంది అన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లా విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వలిగొండ మండలంలో ఉన్న చైతన్య పాఠశాలల తో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల ద్వారా పేద మధ్య తరగతుల విద్యార్థులను అభివృద్ధి చేస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంటే మరోవైపు బడిబాట ద్వారా ఉపాధ్యాయులు అడ్మిషన్ వర్క్ చేస్తూ ఉంటే జిల్లా విద్యాధికారి ప్రైవేటు పాఠశాలల తొత్తుగా మారడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే జిల్లావ్యాప్తంగా అనుమతులు లేని పాఠశాలల పై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలో ఉద్యమాలు నిర్వహించి శ్రీ చైతన్య పాఠశాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అనుమతులు పాఠశాలలు చర్యలు వరకు పోరాటాల నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.