18 July, 2026 | 3:25 PM

ఆ వార్తలను నమ్మొద్దు!

11-06-2024 02:09 AM

కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు సురేష్ గోపి

తిరువనంతపురం, జూన్ 10: తనకు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగడం ఇష్టం లేదని, తాను క్యాబినెట్ హోదా నుంచి తప్పుకొంటున్నానని కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని, దయచేసి ఆ వార్తలను నమ్మొద్దని కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు సురేష్ గోపి సోమవారం ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు. ప్రధాని మోదీ కేరళ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, ఆయన తనదైన విజన్‌తో ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడతారనే నమ్మకం తన కుందని చెప్పారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సురేష్ గోపి కేరళలోని త్రిస్సూర్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రం నుంచి ఎంపీగా గెలిచిన మొట్టమొదటి బీజేపీ అభ్యర్థిగా ఆయన రికార్డు సృష్టించారు. అంతేకాదు.. ప్రధాని మోదీ క్యాబినెట్‌లో కేంద్ర మంత్రిగా పదవి దక్కించుకున్నారు. ఆదివారం ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.