సిక్కిం సీఎంగా ప్రేమ్‌సింగ్ ప్రమాణ స్వీకారం
11-06-2024 02:10 AM
గ్యాంగ్‌టక్, జూన్ 10: సిక్కిం సీఎంగా రెండోసారి సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్కేఎం) నేత ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లోని పాల్జోర్ స్టేడియంలో 30,000 మంది అతిథుల సమక్షంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటికే ప్రేమ్‌సింగ్ ఎస్కేఎం శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ నిర్ణయం మేరకు తాజాగా సీఎంగాను పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 32 స్థానాల్లో ఎస్కేఎం 31 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. కేవలం ఒక సీటును మాత్రమే ఎస్డీఎఫ్ దక్కించుకున్నది.






