calender_icon.png 20 July, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్ యార్డ్ మాకొద్దు..!

19-07-2025 12:00:00 AM

కొల్లూరు తండా వాసుల ధర్నా 

రామచంద్రాపురం, జులై 18 : రామచంద్రపురం మండలం కొల్లూరు తాండలో ఉన్న డంపింగ్ యార్డును మా ప్రాంతం నుండి తరలించాలని పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు తాండ, కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ వాసులు, ఇరికుంట తాండ వాసులు కొల్లూరు తాండ నుండి డంపు యార్డును తరలించాలని ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల ప్రజలతో కలిసి ఇరికుంట తండా మాజీ సర్పంచ్ సంతోషి శంకర్ నాయక్ మాట్లాడుతూ... కొల్లూరు తండా సర్వే నెంబర్ 297 లో ఆరు ఎకరాలలో చెత్తాచెదారంకు సంబంధించిన డంపింగ్ యార్డును అధికారులు కొనసాగిస్తున్నారని తెలిపారు.  డంపు యార్డును ఈ ప్రాంతం నుండి తరలించాలని గతంలో కూడా తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగిందని గుర్తు చేశారు.

కొన్ని రోజులు మాత్రమే కొల్లూరు తాండాలో  డంపింగ్ యార్డును తరలించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు తరలించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ ను తరలించానని కోరారు. ఈ కార్యక్రమంలో చందు నాయక్, హనుమంతు నాయక్, విజయ్ నాయక్, లక్ష్మణ్ నాయక్, శంకర్ నాయక్, రమేష్ నాయక్, దేవేందర్ నాయక్, గోపాల్ నాయక్, బాబు నాయక్, తదితరులు పాల్గొన్నారు.