18-07-2025 11:07:56 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భారత జాతీయ మహిళా సమాఖ్య(NFIW) మహాసభలు విజయవంతంకై శుక్రవారం పాల్వంచ సిఆర్ భవన్ (సిపిఐ కార్యాలయం)లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో భారత జాతీయ మహిళా సమాఖ్య(NFIW) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ వీసంశెట్టి పద్మజ మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు మహిళలపై జరుగుతున్న వేధింపులు, హత్యలు, అత్యాచారాలు రకరకాల హింసలు పెరిగిపోతున్నాయి. భారత రాజ్యాంగంలో మహిళలకు అనేక రకాల హక్కులు ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో నిర్భయ, దిశ చట్టాలు వచ్చినప్పటికీ మహిళలకు భద్రత కరువైందన్నారు.
పాలక ప్రభుత్వాలు చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే ఈ హింస ఇంకా పెచ్చరిల్లుతున్నదన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని, మహిళల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజా పోరాటాలను నిర్వహిస్తూ ఎన్నో విజయాలు సాధించిన భారత జాతీయ మహిళా సమాఖ్య(NFIW) పాల్వంచ మండల, పట్టణ 5వ మహాసభలు ఈనెల 21న పాల్వంచలో జరగనున్నాయని, ఈ మహా సభలకు పాల్వంచ మండల, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.