19-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, జూలై 18(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలి, నిర్మాణపు పనులు త్వరగా పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులకు, లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం వట్పల్లి మండలం దేవనూరు గ్రామంలో బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత త్వరగా బిల్లులు లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పాండు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
వట్పల్లి మండలం సాహేద్ నగర్ గ్రామంలో డిజిటల్ రీ సర్వే కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వట్టిపల్లి మండలం, సాహేద్ నగర్ గ్రామంలో జరుగుతున్న డిజిటల్ రీ సర్వే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికారడ్స్ సహాయ సంచాలకులు ఐనే ష్, ఆర్డీవో పాండు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు.