13-08-2025 12:38:38 AM
చేర్యాల, ఆగస్టు 12: యూరియాను కృత్రమ కొత్త సృష్టించొద్దని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి అన్నారు. కొమరవెల్లి మండల కేంద్రంతోపాట అయినా పూర్ గ్రామంలో పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా ను రైతులకు అందుబాటులో ఉంచాలని, ఎవరైనా బ్లాక్ మార్కెట్ ను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను పంటలకు వాడుకోవాలని సూచించారు.
ఇంకా రైతు బీమాకు అప్లై చేసుకొని రైతులు 13 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ దుకాణాల స్టాక్ రిజిస్టర్లు, యూరియా సెల్స్ రిజిస్టర్లు పరిశీలించారు.
యూరియా సెల్స్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలని దుకాణదారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు బీమా అప్లికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ తోపాటు వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు.