calender_icon.png 13 August, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మసకబారుతున్న మానవ సంబంధాలు!

13-08-2025 12:39:55 AM

- అక్రమ సంబంధాల మోజులో భార్యభర్తలపై అఘాయిత్యాలు

- కన్న తల్లిదండ్రులపై కొడుకుల దాడి!

- ఆస్తులు, అక్రమ సంబంధాలే నేర ప్రవృత్తికి ప్రధాన కారణాలు!

- క్షణపాటి ఆవేశాలతో జీవితం దుర్భరం 

అలంపూర్, ఆగస్టు 12:అనాటి రోజుల్లో మనుషులకు మానవ సంబంధాలే ఆధారంగా ఉండేవి.విలువలు,సాటి మనిషి పట్ల గౌరవ,మర్యాదలు కలిగి నడుచుకునేవారు. చిన్న, పెద్ద,భయం ,భక్తి, అనే విషయాలను కుటుంబ సభ్యులతో చర్చించేవారు.చుట్టుపక్కల వారికి ఏవైనా సమస్యలు వస్తే తమ సమస్యగా భావించి తగు సాయం చేసి ఆదుకునేవారు.అందరితో సోదర భావంతో కలి సి ముందుకు పోవాలని పిల్లలకు , యువతగు చెప్పేవారు.

తల్లిదండ్రులపై విధేయత కలిగి కుమారులు,అన్నదమ్ముళ్ల మధ్య ఆత్మీయత పంచే విధంగా మంచి కుటుంబ వ్యవ స్థలు ఉండేవి. పెద్దవారు మంచి చెడుల గు రించి నైతిక విలువలు నేర్పించేవారు.కానీ కాలక్రమేణనేటి పరిస్థితులను చూస్తుంటే అవన్నీ కనుమరుగై పోయే దుస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నం దినదినానికి అభివృద్ధి చెందుతున్న కా లంలో మనిషి మాత్రం సాటి మనిషి పట్ల మానవతా విలువలు మర్చిపోయి విచక్షణరహితంగా మారుతున్నాడు. అందుకు జిల్లా లో జరిగిన పలు సంఘటనలు ఉదాహరణలుగా చూడొచ్చు.నవ మాసాలు మోసి కని పెంచి , పెద్దచేసిన తల్లిదండ్రులపై కొడుకులు దాడులకు పాల్పడుతున్నారు.

 ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు

1.ఉండవల్లి మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన కురువ లక్ష్మీదేవి తన భర్తను కో ల్పోయి ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఇద్దరు కొడుకులు బాగోగులు పట్టించుకోకపోవడమే కాక ఆమె పేరు మీద ఉన్న పొ లానికి వచ్చే డబ్బులపై ఆశపడి ఏకంగా తల్లి పైనే దాడి చేసి చంపేస్తామని బెదిరించా రు. దీంతో ఆమె స్టేషన్ మెట్లు ఎక్కి తన బాధను పోలీసులకు చెప్పుకుంది.

2 నిన్నటికి నిన్న వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన హుస్సేన్ బి ...కొడుకు కోడలు ఆస్తి రాపించుకొని ఆమెకు లేని రోగాన్ని అంటగట్టి బయటకు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేసింది.దీంతో న్యాయం కోసం కలెక్టరేట్ ఆశ్రయించి కలెక్టర్కు తన బాధను చెప్పుకుంది.

3.తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య . నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలకు ఆస్తులు, అక్రమ సంబంధాలు, క్షణపాటి ఆవేశాలే ప్రధాన కారణమని స్పష్టమవుతుంది.

మానవతా విలువలు పెంపొందించాలి 

మనుషుల్లో మానవత్వ విలువలు పెంచాలి. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి.సాటి మనిషి పట్ల గౌరవ మ ర్యాదలు కలిగి ప్రేమ,జాలీ వంటి లక్షణాలను చిన్నప్పటి నుంచి ఆలవర్చుకోవా లి. క్షణ పాటి ఆనందాలకు,ఆవేశాలకు పోయి విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. పెద్దలు చెప్పిన విలువైన మాట లు విని క్రమశిక్షణతో నడుచుకోవాలి.

 సురవరం లోకేశ్వర్ రెడ్డి,  రిటైర్డ్ వీఆర్‌ఏ, మాజీ సర్పంచ్, ఇటిక్యాల పాడు గ్రామం