15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బేసిక్ పోలీసింగ్‌ను మర్చిపోవద్దు

23-10-2025 12:00 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 22 : పోలీసులు విధి నిర్వహణలో ‘బేసిక్ పోలీసింగ్’ తప్పకుండా పాటించాలని ఎల్బీనగర్ డీసీపీ బి.అనురాధ అన్నారు. ‘ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్’  ఫార్ములాతో  పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. బుధవారం  హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను డీసీపీ సందర్శించారు. ఈ సందర్భంగా హయత్ నగర్ పోలీసుల పనితీరును పరిశీలించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. ‘ఫెయిర్ పోలీసింగ్’ అంటే చట్టం ముందు అందరూ సమానమేనని, నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు. 

ప్రజల రక్షణయే ప్రధాన ధ్యేయంగా  శాంతిభద్రతల నిర్వహణ కోసం ‘ఫర్మ్  పోలీసింగ్’, ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ‘ఫ్రెండ్లీ పోలిసింగ్’ నిర్వహించాలని ఆదేశించారు.  న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే పేదలు, మహిళలు, వృద్ధులతో మర్యాదగా వ్యవహరించాలని, వారికి న్యాయం చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ వ్యవస్థలో ఏఐ లాంటి వినూత్న మార్పులు వచ్చినప్పటికీ నేరాల నియంత్రణలో బేసిక్ పోలీసింగ్ మరువొద్దు అన్నారు. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. పెండింగ్ కేసుల మీద దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్, డీఐ సంతోష్, అడ్మిన్ ఎస్సు లక్ష్మీనారాయణ, ఎస్సులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.