calender_icon.png 23 October, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు జనమాధ్యమాలు.. జనమాధ్యమాల్లో తెలుగు

23-10-2025 12:00:00 AM

ఐఐఎంసీ కాలేజీలో పుస్తకావిష్కరణ సభ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఐఐఎంసి డిగ్రీ, పీజీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) తెలుగు శాఖ ఆధ్వర్యంలో శ్రీ చల్లా సోమ్‌రాజ్‌రామ్  సమావేశ మందిరం వేదికగా బుధవారం ప్రముఖ రచయిత, ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రచించిన “తెలుగు జనమాధ్యమాలు- జనమాధ్యమాల్లో తెలుగు” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఐఐఎంసి కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు రామకృష్ణ ఇరుకుల్ల పుస్తకావిష్కరణ ఉద్దేశాన్ని వివరిస్తూ ఈ పుస్తకం డిగ్రీ మొదటి మరియు  చివరి సంవత్సరం చదువుతున్న తెలుగు విద్యార్థులకు పరిశీలనా గ్రంథంగా ఉపయోగపడుతుందని తెలిపారు. సభాధ్యక్షులుగా వ్యవహరించిన కళాశాల ప్రాచార్యు లు కూర రఘువీర్ మాట్లాడుతూ పుస్తక రచయిత రచించిన వివిధ పుస్తకాలు, గాంధీజీ గురించి తెలుగులో ఎవరు రాయని పుస్తకాల గురించి తెలియజేశారు.

గౌరవ అతిథి గా విచ్చేసిన  ప్రముఖ కవి, రచయిత ఐ.ఏ. ఎస్.ఆఫీసర్(రిటైర్డ్) డా. విద్యాసాగర్ అంగళకుర్తి నాగసూరి పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని సాహితీవేత్త, కళాశాల చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనాథంకు అందజేశారు. డా. విద్యాసాగర్ మాట్లాడుతూ నాగ సూరి రచించిన “తెలుగు జనమాధ్యమాలు జనమాధ్యమాల్లో తెలుగు” పుస్తకం ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్తుందని తెలుపుతూ వారు రాసిన పుస్తకాలలోని ఎన్నో విషయాలను తెలియజేశారు.

గ్రంథ రచయిత డా. నాగసూరి వేణుగోపాల్ స్పంది స్తూ ఈ రోజు ఆవిష్కరించిన పుస్తకాన్ని ఆచార్య వంగపల్లి విశ్వనాథంకు అంకితం ఇచ్చారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యాధనుంజయ్ ఈ పుస్తకానికి ముందుమాటను రాశారు.

కార్యక్రమంలో ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డా. నాళేశ్వరం శంకరం, కళాశాల డీన్‌లు డా.తిరుమలరావు, డా. సంతోషి, కళాశాల వివిధ శాఖల అధ్యక్షులు, సాహిత్య అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథ రచయిత అతిథులకు పుస్తక సత్కారం చేశారు. అనంతరం ఎన్ మాధవి వందన సమర్పణ చేస్తూ సభను ముగించారు.