22-10-2025 11:28:51 PM
విజయక్రాంతి వార్తకు స్పందన..
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 85 డిపిలో ఆక్రమిత కట్టడాలను సింగరేణి సెక్యూరిటీ అధికారులు కూల్చివేశారు. సింగరేణి భూముల్లో రియల్ దందా శీర్షికతో విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన వార్తకు సింగరేణి అధికారులు స్పందించారు. 85 డీప్ ఏరియాలో ఆక్రమించిన స్థలంలో హద్దుల కోసం ఏర్పడిన సిమెంట్ ఫోల్స్ను కూల్చి వేశారు. సింగరేణి స్థలంలో అక్రమంగా నిర్మించిన ఓ షెడ్డును సింగరేణి సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది కూల్చివేశారు. అంతటితో ఆగకుండా సింగరేణి అధికారులు బెల్లంపల్లిలో అక్రమితకు గురైన సింగరేణి భూముల సర్వేను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి ఆక్రమిత భూములను గుర్తించి సర్వే చేసి భూముల లెక్కను తేల్చేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.