21-02-2026 02:20:00 AM
జీహెచ్‌ఎంసీని ముట్టడించిన ఆటో కార్మికులు
రంగంలోకి ముగ్గురు కమిషనర్లు
ఉద్యోగ భద్రత, బీమాపై అధికారుల పక్కా హామీ
చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో పారిశుద్ధ్య నిర్వహణ కొత్తగా ఏర్పడిన ట్రై కార్పొరేషన్ల జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలోని స్వచ్ఛ ఆటో కార్మికులు తమ నిరసన గళాన్ని విప్పారు. తమను ప్రైవేట్ సంస్థ రాంకీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వందల మంది శుక్రవా రం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.
ఈ ఆందోళనతో నగరంలో చెత్త సేకరణ పూర్తిగా నిలిచిపోగా, ముగ్గురు కమిషనర్లు రంగంలోకి దిగి చర్చలు జరపడంతో సాయంత్రానికి సంక్షోభం సద్దుమ ణిగింది. ఉదయం నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, కార్మికులు బల్దియా గేట్లను దిగ్బంధించారు. రాంకీ సంస్థకు తమను అప్పగిం చడం అంటే తమ పొట్ట కొట్టడమేనని ఆవేదన వ్యక్తంచేశారు.
దశాబ్దకాలంగా స్వతం త్రంగా పనిచేస్తూ నగరాన్ని శుభ్రం చేస్తున్న తమను కార్పొరేట్ సంస్థకు బానిసలుగా మార్చొదంటూ నినాదాలతో హోరెత్తించా రు. పోలీసు బందోబస్తు ఉన్నా కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో లోయర్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. రాంకీతో పనిచేయడం తమకు ఏమాత్రం కుదరదని చెప్పారు.
ముగ్గురు కమిషనర్ల అత్యవసర భేటీ
పారిశుధ్యం స్తంభించిపోవడంతో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, సైబరాబాద్ కమిషనర్ జి. సజన, మల్కాజిగిరి కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సాయం త్రం కార్మిక సంఘాల నేతలు, డ్రైవర్లతో ముఖాముఖి చర్చలు జరిపారు. కార్మి కులు వ్యక్తం చేసిన భయాలను, సమస్యలను కమిషనర్లు ఓపిగ్గా విన్నారు.
100 రోజుల ప్రణాళికలో భాగంగా నగరాన్ని పరిశుభ్రం గా ఉంచడంలో స్వచ్ఛ ఆటోల పాత్ర కీలకమని, కార్మికుల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు.కార్మికులకు ఎటువంటి అన్యా యం జరగకుండా చూస్తామని ముగ్గురు కమిషనర్లు ఉమ్మడిగా హామీ ఇచ్చారు. స్వచ్ఛ ఆటో కార్మికుల ఉద్యోగ భద్రతకు కా ర్పొరేషన్లు పూర్తి బాధ్యత వహిస్తాయని స్ప ష్టం చేశారు. విధుల్లో ప్రమాదం జరిగితే ఎక్స్‌గ్రేషియా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
ఆర్టీఓ అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తామని, చెత్త అన్‌లోడింగ్ సమయంలో వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు మరిన్ని ట్రాన్స్ఫర్ పాయింట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన కార్మికులు తమ ఆందోళన విరమించి, శనివారం ఉదయం నుంచి యధావిధిగా విధులకు హాజరవుతామని ప్రకటించారు.చర్చల ముగింపులో స్వచ్ఛ ఆటో కార్మికులు కీలక హామీ ఇచ్చారు.
తమ ఏరియాల్లో ప్రతి ఇంటి నుంచి 100 శాతం చెత్త ను సేకరించి నగర స్వచ్ఛతలో భాగస్వాములమవుతామని అధికారులకు మాట ఇచ్చారు. కొ త్తగా విలీనమైన పురపాలికల్లోనూ ముమ్మరంగా సేకరణ చేపడతామన్నారు.అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, రవి కిరణ్, యాద గిరిరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ పాల్గొన్నారు.