calender_icon.png 20 January, 2026 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోనేటిలో పడి బాలుడి మృతి

19-01-2026 01:00:49 AM

సిద్దిపేట జిల్లా సింగరాయ జాతరలో స్నానికి వెళ్లి ఫిట్స్ రావడంతో..

నంగునూరు, జనవరి 18: జాతరలో పవిత్ర స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడం తో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన సిద్దిపేట జిల్లా కూరెళ్ల సింగరాయ జాతరలో జరి గింది. కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన బొందిలి శివసాయి (15) 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కుటుం బ సభ్యులతో కలిసి జాతరకు వచ్చాడు. కోనేరులో స్నానం చేస్తున్న సమయంలో శివసా యికి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో నీటిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్సులో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృ తి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.