calender_icon.png 7 August, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీకి ఊరట

07-08-2025 01:15:24 AM

పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ ప్రజాప్రతినిధుల కోర్టు

రాంచీ, ఆగస్టు 6: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఆరేళ్ల క్రితం నాటి కేసులో జార్ఖండ్ ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారని రాహుల్ తరఫు న్యాయవాది మీడియాకు వెల్లడించారు.

న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. 2018లో జార్ఖండ్ పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ కేంద్ర మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రతాప్‌కుమార్ అనే వ్యక్తి చైబాసా లోని మెజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.