calender_icon.png 3 February, 2026 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డు అభివృద్ధే నా లక్ష్యం..

03-02-2026 02:33:51 AM

13వ వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకలి రవి

జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 2: గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం 13వ వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నానని ఎరుకలి రవి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 13వ వార్డ్ మంత్రి కుంట కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నన్ను ఆదరించి ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే  13వ వార్డ్ మంత్రి కుంట, మాదారం అంబేద్కర్ కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు, ఫార్మేషన్ రోడ్లు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు.

అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు  వార్డ్ లోనే ఇప్పించేందుకు నాశాయశక్తుల కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో పరిష్కరించాల్సిన సమస్యలను ముందుగా పరిష్కరిస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రా మంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.

వార్డులో ఉన్న సమస్యలను తమ గ్రామ ప్రజల సలహా సహకారాలతో పరిష్కరించి, అభివృద్ధి దిశలో నడిపించుకొని ముందుకు సాగుతానని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా గ్రామ అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యక్రమాలు అందరితో కలిసి ముందుకుపోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ వార్డు సభ్యులు ఎల్లయ్య ముదిరాజ్, జగన్ ము దిరాజ్, మంత్రి అశోక్,  రాజు, నర్సింగరావు,  వీరేష్,నరసింహ, బాలరాజు, కృష్ణ సాయి, లక్ష్మణ్, విజయ్ ప్రవీణ్, యువకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.