30 June, 2026 | 1:45 AM

ఇంటింటి ఓటరు సవరణ పరిశీలన

30-06-2026 12:00 AM

ఘట్ కేసర్, జూన్ 29 (విజయక్రాంతి) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా సోమవారం సోమవారం ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్కేసర్ డివిజన్, ఎదులాబాద్ డివిజన్ లలో ఇంటింటి ఓటరు సవరణ కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ పరిశీలించారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు నిర్వహిస్తున్న ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేసేలా పారదర్శకంగా, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని బీఎల్‌ఓలకు సూచించారు. ప్రజలు ఎన్యుమరేషన్ ఫారమ్ను పూర్తి వివరాలతో నింపి సమర్పించాలని, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ సర్ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.

ఈకార్యక్రమంలో  జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్,  సెక్రెటరీ మామిడ్ల ముత్యాలు యాదవ్, మున్సిపల్ మాజీ ఛైర్మెన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, సామల అమర్, కర్రె రాజేష్, కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, కందుల కుమార్, మేడబోయిన వెంకటేష్, బద్దం గోపాల్ రెడ్డి, సురేష్ నాయక్, పార్టీ నాయకులు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, కార్యకర్తలుపాల్గొన్నారు.