02-07-2025 12:52:31 AM
మండలంలోని పలువురు వైద్యుల్ని సన్మానించిన ఎస్ కేటి గ్రూప్స్ డైరెక్టర్ పిచ్చేశ్వరరావు
అశ్వాపురం,జూలై 1(విజయ క్రాంతి):మనల్ని సృష్టించింది కంటికి కనపడని ఆ దేవుడైతే, మ నకు ప్రాణం పోసేది మాత్రం కనపడే వైద్యులేనని వారినే ప్రతి ఒక్కరు దేవుళ్ళుగా భావిస్తారని ఎస్ కే టి గ్రూప్స్ డైరెక్టర్ పిచ్చెశ్వర రావు అన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోఅశ్వాపురం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులను, భారజల కర్మాగారంలో వైద్యులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఉద్యోగి కైనా, ఏ వ్యక్తి కైనా వారు చేస్తున్న పనిలో ఒక రోజు సెలవు ఉంటుంది కానీ వైద్య వృత్తి నిర్వహించే వారికి ఎప్పటికీ కూడా సెలవు అనేది ఉండదని నిరంతరం ప్రాణాలు పోయడానికి మాత్రమే వైద్యులు కృషి చేస్తారని వారిని అందరూ దేవుళ్ళుగా భావిస్తారని అన్నారు.
అశ్వాపురం మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు ఈ సీజనల్ వ్యాధుల పట్ల సాధ్యమైనంత వరకు భారజల కర్మాగారం తరపున కూడా వైద్య సేవలు అందించాలని ఎస్కేటి గ్రూప్స్ డైరెక్టర్ పిచ్చేశ్వరరావు వైద్యులను కోరారు. వారు సానుకూలంగా స్పందించి మండలంలోని గిరిజన ప్రాం తాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
మండల ప్రభుత్వ ఆసుపత్రి , బారజల కర్మాగార ఆసుపత్రి నందు వైద్యం అందిస్తున్న వైద్యులను శాలువాతో ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు విజయకుమార్,మదన్మోహన్, సంకీర్తన,శివకుమార్, చంద్రిక రెడ్డి, ప్రగతి, బి ఆర్ ఎస్ మాజీ మండలాధ్యక్షులు, సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జునరావు,న్యాయవాది గురుకృష్ణ,బాలజల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.