02-07-2025 12:50:25 AM
భద్రాచలం, జూలై 1 (విజయక్రాంతి) డ్రగ్స్ రహిత సమాజం నిర్మలనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భద్రాచలం ట్రాఫిక్ ఎస్‌ఐ తిరుపతి అన్నారు. మదర్ తెరిసా చా రిటబుల్ ట్రస్ట్ , షాజ్ బ్లడ్ ఆర్గనైజేషన్, శ్రీ సీతారామ ఆటో అసోసి యేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఆటో డ్రైవర్లకు మాదక ద్రవ్యాల పై అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సు లో ఆయన పాల్గొని మాట్లాడుతూ మాదకద్రవ్యాలు యువతను , ప్రజల జీవితాలను నాశనం చేస్తాయని, వాటిని దరిచేరనీయవద్దని అన్నారు. మాదకద్రవ్యాల మత్తులో యువత పడరాదని, అక్రమ రవాణా అరికట్టడానికి బాధ్యత చేపట్టాలన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా అమ్మకం తెలిసిన యెడల పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రైవర్స్ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్త్స్రలు రామకృష్ణ, స్వప్న,ట్రస్ట్ చైర్మన్ కొప్పుల.మురళి, షాజ్ బ్లడ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మహ్మద్ సింద, శ్రీ సీతారామ ఆటో అసోసియేషన్ అధ్యక్షులు రాయల.శ్రీను , రామ్మూర్తి, రాంబాబు ఆటో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు