16 April, 2026 | 2:15 AM

డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ డిస్ట్రిక్ట్ హెల్ప్‌లైన్ సెంటర్ ప్రారంభం

16-04-2026 01:05 AM

ముకరంపుర ,ఏప్రిల్ 15( విజయ క్రాంతి)2026 - 27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ లో అడ్మిషన్ పొందేందుకు రూపొందించబడిన దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ) నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 13న విడుదల చేయడం జరిగింది.దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుటకు స్థానిక ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో కరీంనగర్ జిల్లాకు సంబంధించి దోస్త్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది.

దోస్త్ మొదటి విడత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు రూ. 200 చెల్లించి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఏప్రిల్ 15 నుండి మే 7 లోపు దరఖాస్తు చేసుకోవాలి .ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు వెబ్ ఆప్షన్ ప్రక్రియ ద్వారా కళాశాలల ఎంపిక ఉంటుందని, మే 14న మొదటి విడత అడ్మిషన్ల అలాట్మెంట్ జరుగుతుందని, మే 15 నుండి మే 23 వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

దోస్త్ రెండవ విడత మే 15 నుండి మే 23 వరకు, వెబ్ ఆప్షన్లు మే 15 నుండి మే 26 వరకు, సీట్ అలాట్మెంట్ మే 30న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు మే 31 నుంచి జూన్ 5 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దోస్త్ మూడవ విడత మే 31 నుండి జూన్ 15 వరకు, వెబ్ ఆప్షన్లు మే 31 నుండి జూన్ 16 వరకు, సీట్ అలాట్మెంట్ జూన్ 20న ఉంటుంది.

సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి జూన్ 25 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దోస్త్ మొదటి, రెండవ మరి యు మూడవ విడతలో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న విద్యార్థులు జూన్ 20వ తేదీ నుండి జూన్ 27వ తేదీ వరకు ఒరిజినల్ టిసి మరియు ఇతర దృవపత్రాలతో సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేసి సీటు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది https:// dost.cgg.gov.in ద్వారా అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని, ఎస్.ఆర్.ఆర్ కళాశాల లోని దోస్త్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ను సంప్రదించి ఇబ్బందుల పరిష్కారానికై మరియు ఎస్సారార్ కాలేజీలో అడ్మిషన్లకై సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 

8639940661 ఎస్సారార్ కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు కళాశాలలో సంప్రదించి తెలుసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ సూచించారు.