16 April, 2026 | 2:36 AM

కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగ జేఏసీ నాయకులు

16-04-2026 01:03 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 15(విజయక్రాంతి): కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారము రోజున జిల్లా కలెక్టర్ శ్రీమతి చిత్రా మిశ్రాను ఉద్యోగ జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం 1:00 గంటలకు భోజన విరామ సమయంలో నిర్వహించనున్న నల్ల బ్యాచులు ధరించి ధర్నా కార్యక్రమానికి అనుమతి పొందారు. ఈ సందర్భంగా జేఎసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం వ్యక్తిగత సమస్యల కోసం కాదని, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.

ప్రస్తుతం ఉద్యోగులు తమ న్యాయమైన హక్కులు అయిన డీఏ, ఇంక్రిమెంట్లు, పీఆర్సీ, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే 3035 సంవత్సరాలు సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారని, ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

చివరగా ఉద్యోగి బలంగా ఉంటే ప్రభుత్వం బలంగా ఉంటుంది ,ప్రభుత్వం బలంగా ఉంటే ప్రజాసంక్షేమం సాఫల్యం అవుతుంది అనే సందేశంతో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కటకం రమేష్, పేండ్యల కేషవ రెడ్డి, వివిద ఉపాధ్యాయ సంఘ నాయకులు సుంకిశాల ప్రభాకర్ రావు, చకినాల రామ్మోహన్,

జాలి మహేందర్ రెడ్డి, చంద్రమౌళి, చింతపల్లి అశోకరావు, ఎండి సలీం, దోనికేన సునీల్ కుమార్, వివిధ సంఘాల సంబంధించిన నాయకులు గడ్డం సుధాకర్,డాక్టర్ అరవింద్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, కిరణ్ కుమార్, కోట రామస్వామి, శంకర్, గూడ ప్రభాకర్ రెడ్డి, మారుపాక రాజేష్, భరద్వాజ్, వెలిచాల సుమంతరావు ,లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.