18 April, 2026 | 8:41 PM

‘డబుల్’ బిల్లులను కక్కిస్తా

12-05-2024 02:58 AM

నిధులు కాజేసిన పోచారం అనుచరులను వదిలిపెట్టం 

బాన్సువాడ కాంగ్రెస్  ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి 

కామారెడ్డి, మే11(విజయక్రాంతి) : అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు డబ్లు బెడ్రూం ఇండ్ల బిల్లులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరుల ఖాతాల్లో వేయించుకొని, ఇప్పుడు కొత్త నాటకానికి తెర తీశారని మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ కాంగ్రెస్ ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిధులు తిరిగి కక్కించి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. శనివారం బాన్సువాడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌షెట్కార్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. డబుల్ బెడ్రూం బిల్లులు రాకుండా రవీందర్‌రెడ్డి అడ్డుకున్నాడని ప్రచారం చేయడం పోచారం స్థాయికి తగదని అన్నారు. లబ్ధిదారులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తదని చెప్పారు.