18 April, 2026 | 10:13 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

కొన్న వెంటనే ధాన్యం మిల్లులకు తరలించాలి

12-05-2024 02:57 AM

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ఆదిలాబాద్, మే 11 విజయక్రాంతి: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. దిలావార్‌పూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తూకపు యంత్రాలు, ప్యాడీ క్లీనింగ్ యంత్రాలు, తేమ యంత్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం దిలావార్ పూర్ ఉన్నత పాఠశాలలోని 282, 288 నంబర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..దాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరం జరగాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

రైతులు ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు తాగునీరు, టెంట్లు ఉండేలా చూడాలని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. అకాల వర్షాలు కురు స్తున్నందున రైతులకు సరిపడినన్ని టార్పాలిన్లను, గన్నీ బ్యాగ్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సకాలంలో మిల్లులకు పంపాలని ఆదేశించారు. అవసరమైతే ధాన్యం తరలింపునకు అదనపు లారీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో సివిల్ సప్లయిస్ డీఎం శ్రీకళ, తహసీల్దార్ స్వాతి, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.