రిజిస్ట్రేషన్లు డబుల్.. ఆదాయం ఏడింతలు
- 2014-15లో రూ.2,746 కోట్ల ఆదాయం
- 2023-24లో రూ.14,588 కోట్లకు చేరిక
- అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచే రాక
- చివరి స్థానంలో కుమ్రంభీం ఆసిఫాబాద్
- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌శాఖ వార్షిక నివేదికలో వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): రాష్ర్టంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పదేండ్లలో ఏడింతలు పెరిగింది. అదే సమ యంలో రిజిస్ట్రేషన్ అవుతున్న డాక్యుమెం ట్లు రెండింతలకు పైగా పెరిగాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. 2014- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.2,746 కోట్లు ఉంటే.. 2023 వచ్చేసరికి రూ.14,588 కోట్లకు చేరింది. ఒక్క కొవిడ్ ఏడాదిలో తప్ప మిగిలిన ప్రతి ఏడాది ఆదాయంలో వృద్ధి కనిపించింది. అదే డాక్యు మెంట్ల విషయానికొస్తే అప్పుడు 8.27 లక్షలు రిజిస్ట్రేషన్లు కాగా.. గతేడాదికి ఆ మొత్తం 18.41 లక్షలకు చేరాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వార్షిక నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది.
దీని ప్రకారం గత ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో అంతకు ముందు సంవత్సరం (2022 చూస్తే అగ్రికల్చర్ డాక్యుమెంట్లు లక్ష మేర తగ్గాయి. అదే నాన్ అగ్రిక ల్చర్ విషయానికొస్తే పెద్దగా మార్పు లేదు. పోయినేడు నాన్ అగ్రికల్చర్‌లో ఓపెన్ ప్లాట్లపై జనాలు ఎక్కువ అమ్మకాలు, కొనుగోళ్లు చేశారు. మొత్తంగా 10.50 లక్షల సేల్ డీడ్స్ జరిగితే అందులో 3.91 లక్షలు ఓపెన్ ప్లాట్లవి, 1.03 లక్షలు ఇండ్లకు, ఫ్లాట్లకు 94,884, ఇక అగ్రికల్చర్‌లో 4.60 లక్షల సేల్ డీడ్స్ చేసుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ఎక్కువగా ఆదాయం తెచ్చిపెడు తున్న జిల్లాల్లో రంగారెడ్డి అగ్రస్థానంలో ఉన్నది.
ఆ తరువాత మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 2023 అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కలిపి రూ.4,798 కోట్లు వచ్చాయి. అత్యల్పంగా ఆదాయం వచ్చిన జిల్లాలలోరూ.13 కోట్లతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఉన్నది. పోయిన సంవత్సరం ఒక్క హెఎండీఏ పరిధిలోనే నాన్ అగ్రికల్చర్ కింద రూ.7,476 కోట్లు వచ్చింది. ఎక్కువ ఆదా యం వస్తున్న టాప్ 30 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లలో ఫస్ట్ రంగారెడ్డి ఎస్‌ఆర్వో ఉన్నది. ఆ తరువాత గండిపేట నిలిచింది.






