calender_icon.png 9 September, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు బలహీన వర్గాల ఆపద్బాంధవుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్

08-09-2025 12:00:00 AM

జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోపు బాల్రాజ్ యాదవ్ 

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల ఆపద్బాంధవుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని మేడ్చల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోపు బాల్రాజ్ యాదవ్ కొనియాడారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 230వవారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘట్ కేసర్ పట్టణంలో నిర్వహించారు. 

ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోపు బాల్రాజ్ యాదవ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ పుట్టకపోయి ఉంటే భారత దేశం ఇంకో రకంగా  ఉండేది, ఇపుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రం ఉండకపోయేది, అసమానతలు మొత్తం నిండిపోయేది భారతదేశం, అసమానతలు కాకుండా సమానత్వం తీసుకురడానికి అప్పట్లో భగవంతుడు కరజన్ముడిని పుట్టిస్తారు కదా, అలాంటి కారణజన్ముడే అంబెడ్కర్ అన్నారు.

ప్రబుద్ధ భారత్ సభ్యులు కూడా ఇలాగే ఈ చైతన్య రధాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమం నిర్వహిస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాసు, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు మేడబోయిన సంజీవ ముదిరాజ్ , జి. పరమేష్, ఎన్. సదానంద్, ఎ. శ్రీనివాస్, కె. నర్సింగ్ రావు, బండారి రాందాస్ , కె. రవి, జి. అంజయ్య, టి శ్రీరామ్, ఎస్. కృష్ణంరాజు, ఈ. విష్ణు, జి. ప్రవీణ్, అఖిల్, లలిత్  పాల్గొన్నారు.