calender_icon.png 9 September, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

08-09-2025 12:00:00 AM

భారీగా హాజరైన భక్తులు

తాండూరు,  సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : పెద్దేముల్ మండల కేంద్రం శ్రీ హనుమాన్ దేవాలయంలో నేడు 29వ వారం హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగింది. విశ్వహిం దూ పరిషత్, బజరంగ్దళ్, హిందూ వాహిని కార్యకర్తలు గత 28 ఆదివారాలుగా మందిరంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణంతో జ్ఞాపకశక్తి పెరిగి జ్ఞానం ,ధైర్యం, భక్తి భావం కలుగుతుందని అన్నారు. ప్రతి గ్రామం దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని దీనితో ఐకమత్యం పెరుగుతుందని వారు పిలుపునిచ్చారు. స్వామివారికి హారతి అందించి , తీర్థ, ప్రసాదాలతో పాటు అల్పాహారాన్ని  పంపిణీ చేశారు.