08-09-2025 12:00:00 AM
చంద్రగ్రహణం కారణంగా ద్వార బంధనం
ఎల్బీనగర్, సెప్టెంబర్ 7 : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయాన్ని ఆదివారం మూసివేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆలయ సిబ్బంది, అర్చకు లు మంత్రాల నడుమ ఆలయ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. సోమవారం ఉదయం ఉదయం 8గంటలకు వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. సోమవారం సంప్రోక్షణ, అభిషేకం అనంతరం 9 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.