15 April, 2026 | 3:16 AM

మేడ్చల్ జిల్లాలో ఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి

15-04-2026 12:54 AM

మేడ్చల్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మేడ్చల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొని అంబేద్కర్ సేవలను కొనియాడారు.

డిసిసి అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలం గౌడ్, సుధీర్ రెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్తి కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గణేష్ నాయక్, వేముల శ్రీనివాసరెడ్డి, బైరి ఈశ్వర్, ఉదండపురం సత్యనారాయణ, గోమారం రమణారెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, రామన్న గారి మణికంఠ గౌడ్, కౌడే మహేష్, పానుగంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు. 

ఘట్కేసర్‌లో..

ఘట్కేసర్ లో పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షు లు వజ్రష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వేముల మహేష్ గౌడ్, పావని జంగయ్య యాదవ్, సింగిరెడ్డి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో..

అంబేద్కర్ జయంతి సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో మేడ్చల్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ తదితరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో శైలజ హరినాథ్, రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.