01-07-2025 02:37:59 AM
ముషీరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి) : లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరా బాద్ అపూర్వ డిస్ట్రిక్ట్ 320ఎ, రిజియన్ 7, జోన్ 2, లయన్ స్టిక్ ఇయర్ 2025- నూతన అధ్యక్షునిగా సమాజ సేవకులు కళాపోషకులు లయన్ డాక్టర్ ఇఎస్.సూర్యనారాయణను సోమవారం జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ అపూర్వ అధ్యక్ష ఎన్నికల్లో లయన్ టి. నైనదేవి ఎం.జె.ఎఫ్.రిటైర్డ్ జాయింట్ కలెక్టర్, అపూర్వ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్, లయన్ వై.సుధాకర్ రావు, క్లబ్ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో క్లబ్ నూతన అధ్యక్షునిగా లయన్ డా.ఇ.ఎస్.సూర్యనారాయణను కార్యదర్శిగా లయన్ డా.ఎల్. మహేష్‌ను, ట్రెజరర్‌గా, లయన్ టి.నైనదేవిని, ఎం.జె.ఎఫ్. ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికై ఈ కమిటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని జూలై 6న లయ న్స్ భవన్, సికింద్రాబాద్‌లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయ న్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఎ, గవర్నర్ లయన్ డా.జి. మహేందర్ కుమార్ రెడ్డి, పిఎంజెఎన్, ఇండక్షన్ ఆఫీసర్ గా లయన్ వైవి.రామచంద్రరావు, పిఎంజెఎఫ్, ప్రత్యేక అతిథిగా సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ హజరు కానున్నట్లు చెప్పారు.