27-12-2025 05:05:24 PM
తాండూరు,(విజయక్రాంతి): కుటుంబ పెద్దను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న నిరుపేద కుటుంబానికి ఆపద సమయంలో ఆర్థికంగా ఆదుకొని అండగా నిలిచారు. వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రముఖ వైద్యులు, బివిజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, తాండూర్ మున్సిపల్ పరిధి 8వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన గురువయ్య స్వామి భార్య గద్వాల సుశీలమ్మ అకాల మృతి చెందారు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ వెంటనే స్పందించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి అంత్యక్రియలకు వీరశైవ సమాజం సభ్యులు గులి పరమేశ్వర్,అబ్లం సంపత్ కుమార్, శ్రీకాంత్ ద్వార డాక్టర్ సంపత్ కుమార్ ఆర్థిక సాయం అందించారు. ఆపద సమయంలో డాక్టర్ సంపత్ కుమార్ అందించిన ఆర్థిక సహాయాన్ని అందుకున్న కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.