calender_icon.png 27 December, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బట్టుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి ఆనవాళ్లు

27-12-2025 05:10:00 PM

పశువుల కాపర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 అటవీశాఖ అధికారులు

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బట్టుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపెట్టినట్టు అటవీ శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం చెన్నూరు అటవీ ప్రాంతం నుంచి గోదావరి దాటి మంథని మండలంలోని ఎల్ మడుగు  దాటి ఆరెంద అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నదని గుర్తించిన అటవీ శాఖ అధికారులు శనివారం  పెద్దపులి  అరెందా దాటి బట్టుపల్లి ఏరియాలో పులి ప్రవేశించిందని, పులి అడుగులు గుర్తించామని  అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు,  రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళలో బయట తిరగవద్దని, పశువులను అటవీ ప్రాంతంలోకి పంపించవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.