27-12-2025 05:01:29 PM
అభివృద్ధి ,సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం మున్సిపాలిటీలో సుమారు 6 కోట్ల 50 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ... అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు అని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో సిసి,బిటి రోడ్లు వర్షపు నీటి కాల్వపనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్, ప్రభుత్వ సలహాదారులు నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మున్సిపల్ కమిషనర్ విజయానంద్, మరిపెడ మండలం అధ్యక్షులు పెళ్లి రఘువీర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్, మరిపెడ మాజీ సర్పంచ్ రామ్ లాల్, కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ అయిలమల్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, కొంపెల్లి శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.