07-07-2025 12:00:00 AM
నిర్మల్, జూలై 6(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆదివారం డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిజెపి నాయకులు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు అయ్యనార్ భూమయ్య మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయ కులు అంజి కుమార్ రెడ్డి శ్రావణ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చలేగా.
నహీ చలేగా అనే నినాదం వినగానే మన కళ్ల ముందు కదులుతారు దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహా నేత దేశంలో జాతీయవాద రాజకీయానికి ఆ మహనీయుని అంకురార్పణ ఇవాళ బీజేపీ రూపంలో చూస్తున్నాం. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ ను దేశంలో సమైక్య భాగంగా గుర్తించాలంటూ ఉద్యమించిన మహానేత.
ఆ ఉద్యమంలోనే అనుమానాస్పదస్థితిలో కశ్మీర్లోనే అసువులుబాశారు.ఇన్నేళ్లకు ఆయన కలను మోదీ నెరవేర్చారు, 370ని రద్దుచేసి సంపూర్ణ స్వరాజ్యం తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ అయ్యాన్నగారి రాజేందర్, జిల్లా కార్యదర్శి కోరిపెళ్ళి శ్రావణ్ రెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబెర్,అల్లం భాస్కర్,చిన్నా రెడ్డి, సీనియర్ నాయకులు, సాదు రామ్ రెడ్డి, పొన్నం నారాయణ గౌడ్,పట్టణ ఉపాధ్యక్షులు ఏపూరి ప్రమోద్, పంతిక ప్రకాష్, బట్టు లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు