calender_icon.png 7 July, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల సంఘాలకు అండగా ప్రభుత్వం

07-07-2025 12:00:00 AM

-కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి 

ఆదిలాబాద్, జూలై 6 (విజయ క్రాంతి):  కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాలకు అం డగా నిలిచింది. ఆయా సంఘాల కమ్యూనిటీహాల్‌ల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిం ది. ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్.డీ.ఎఫ్) కేటాయించిన నిధులను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం 10 కులాల సంఘాలకు గాను ఒక్కోదానికి రూ.5 లక్షల చొప్పున రూ.50లక్షల నిధుల ప్రొసిడింగ్ కాపీలను కుల సంఘాల ప్రతినిధులకు  అందజేశారు.

ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మున్నూరు కాపు, రెడ్డి, రజక, ముదిరాజ్, నాయిబ్రాహ్మణ, గంగపుత్ర, మాదిగ, మాల, గోండ్, లంబాడ కుల సంఘాల భవనాలు, నిర్మాణలు, వివిధ రకాల మౌళిక వసతులు కల్పించేందుకు ఈ నిధులను కేటాయించామన్నారు.  సీఎం రేవంత్‌రెడ్డి నాయక త్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ నిధులు మంజూరు కావడంలో గత ఇం చార్జి మంత్రి సీతక్క, ప్రస్తుత జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభు త్వ పెద్దలందరి కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయ కులతో పాటు ఆయకుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.