9 May, 2026 | 12:23 AM

డ్రైనేజీ ఆక్రమించి దర్జాగా వ్యాపారాలు

17-09-2025 12:17 AM
  1. వాహన దారులకు ఇక్కట్లు
  2. పంచాయతీ, ఆర్‌అండ్‌బి అధికారులు పట్టించుకోవాలి

పినపాక, సెప్టెంబర్ 16, (విజయక్రాంతి ):ఇ బయ్యారం క్రాస్ రోడ్ లో వ్యాపారస్తులు ఇష్టారాజ్యం... ఆడిందే ఆట పాడిందే పా టలా ఉంది. తనకు అడ్డు ఎవరూ లేరన్నట్టు గా డ్రైనేజీ ని ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలు లాగా సాగుతున్న... వాహనదారులు, పాదాచారులు అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ నాకేమీ పట్టదు అన్నట్లుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

అక్ర మంగా ప్రభుత్వ డ్రైనేజీ ఆక్రమించి వ్యాపార వ్యవహారం నిర్వహిస్తున్న అక్రమార్కుని పై విజయ క్రాంతి న్యూస్ కథనం...పినపాక మండలం... ఏడుళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో నిర్వాకులు ప్రభుత్వ డ్రైనేజీని అక్రమంగా ఆక్రమించి గత కొన్ని సంవత్సరాలుగా వ్యా పారాలు నిర్వహిస్తున్నారు పంచాయతీ సి బ్బందికి డ్రైనేజీ శుభ్రం చేయడం ఇబ్బందిగా మారింది. దీనితో అక్కడ దుర్వాసన రావడం జరుగుతుందని పలువురు కస్టమర్లు వాపోయారు.

అలాగే వాహనాలు పార్కింగ్ చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే ఎక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటాయోనని ప్ర ధాన రహదారిపై వెళ్లే వాహనదారులు భ యాందోళనకు గురవుతున్నారు. ఇంతా జ రుగుతున్న పంచాయతీ ఆర్ అండ్ బి అధికా రులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు, పంచాయతీ, ఆర్ అండ్ బి అధికారులు దృ ష్టి సారించి అక్రమంగా డ్రైనేజీ ఆక్రమించిన హోటల్ నిర్వాహకునిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం..

డ్రైనేజీ ఆక్రమణ విషయమై ఎంపీఓ వెంకటేశ్వరరావును వివరణ కోరగా డ్రైనేజీ ఆక్రమణ పై గతంలో ఈ. బయ్యారం క్రాస్ రోడ్ లో డ్రైనేజీ ఆక్రమణ పై నోటీసులు ఇ వ్వడం జరిగింది. దీనిని అతిక్రమించి కొంతమంది వ్యాపారస్తులు మరలా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ డ్రైనేజీ ఆక్రమణపై సంబంధిత ఆర్ అండ్ బి శాఖ స్పందించి పంచాయతీ శాఖకు సహకరిస్తే  డ్రైనేజీ ఆక్రమణపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 ఎంపీఓ వెంకటేశ్వరరావు