17-09-2025 12:17:33 AM
నారాయణఖేడ్, సెప్టెంబర్ 16:నరేంద్రమోడీ జన్మదిన వేడుకలను నారాయణఖేడ్ పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బిబి పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు రాథోడ్ పాల్గొన్నారు.
బీజేపీ కా ర్యకర్తలు, మోడీ అభిమానులు యువకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ హృదయ సంబంధిత సమస్యల నివారణకు, కొత్త రక్తం ఏర్పడి వ్యాధినిరోధక శక్తి పెరగడానికి, ముఖ్యంగా ఆపదలో ఉన్న వారికి అత్యవసర చికిత్సల కొరకు మన రక్తం ఉపయోగపడి మరొకరికి ప్రాణదానం అయ్యే అవకాశం ఉంటుందని, కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ కార్యక ర్తలను అభినందనలు తెలిపారు.
ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రామకృష్ణ, సిందో ల్ దశరథ్, మాజీ ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహ రెడ్డి, శంషాబాద్ రాజు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్, బస్వారాజ్ చాప్ట కార్యదర్శులు భూమయ్య,అరుణ్ రాజ్, సర్పంచ్ విఠల్, యువ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ పట్నం మాణిక్, కో కన్వీనర్ సాయి,నాగల్గిద్దా, సిర్గాపూర్ మండల అధ్యక్షులు రాజశేఖర్,
శంకర్ పాటిల్, సిదయ్య స్వామి, కిసాన్ మోర్చా దశరథ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు సచిన్, కానికేందర్, సగుణాకర్, మేకల జ్ఞానేశ్వర్, సాకేత్ రెడ్డి, కమ్మ సాయి మోహన్, సాయందర్,అంజన్న, నవీన్, భూంరాజ్, యాదగౌడ్, అశోక్, వెంకటేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.