calender_icon.png 17 September, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాతృభాష మాధుర్యం కోసం!

17-09-2025 12:20:04 AM

  1. తెలుగు భాషపై పట్టుకై     
  2. సంస్కృతి పరిరక్షణకు
  3. పలు అంశాల్లో పోటీలు 
  4. గిరి బిడ్డల్లో వికాసం 
  5. ఐటీడీఏ పీవో ప్రత్యేక దృష్టి

భద్రాచలం, సెప్టెంబర్ 16, (విజయక్రాంతి):మాతృభాష మాధుర్యం వర్ణించ లేనిది. అందులో తెలుగు భాష తీయదనం తెలియనిది కాదు. భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలుగు భాష పరిరక్షణకు ఎంతగానో పాటుపడుతున్నారు. గిరిజన విద్యాల యాల్లో తెలుగు భాష గొప్పతనాన్ని మరింత ఇనుమడింప చేసేలా బాల బాలికలను ప్రో త్సహిస్తున్నారు. అందులో భాగంగా రకరకాల పోటీలు నిర్వహిస్తున్నారు.

తెలుగు భాష దినోత్సవం సందర్భంగాతెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగులో కవిత లు, శీర్షికలు, పద్యాలు, ఒక నిమిషం పాటు తెలుగులో మాట్లాడటం, ఏకపాత్రాభిన యం, క్విజ్  పోటీలు నిర్వహించారు. ఈ పో టీల్లో బాలబాలికలు ఉల్లాసంగా, ఉత్సాహం గా పాల్గొన్నారు.

తెలుగుతనం ఉట్టిపడేలా సాగిన ఈ సాంస్కృతిక పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రదర్శనలు రక్తి కట్టించాయి. అద్వితీయమైన ప్రదర్శనలు ప్రే క్షకులను ఆలోచింపచేసేలా చేశాయి. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులను అందజేశారు. 

 భాష పటుత్వం కోసం..

ఐటీడీఏ చరిత్రలోనే తెలుగు భాషా పటు త్వం కోసం జరిగిన ప్రయత్నంగా ఐటీడీఏ పీవో రాహుల్ చర్యను అభివర్ణించవచ్చు. పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ పోటీలకు విశే ష స్పందన రాగా, తెలుగు భాష అభివృద్ధికి తన వంతు కృషిసల్పిన ఐటీడీఏ పీవో రాహుల్ ను పలువురు అభినందించారు. పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు  రాహుల్, ఐఏఎస్, ఐటీడీఏ పీవో భ ద్రాచలంతెలుగు భాష పై పట్టు కోసంవివిధ రకాల పోటీలు నిర్వహించటం జరుగుతుందని తద్వారా పిల్లల్లో సృజనాత్మక శక్తి పెం పొందుతుందని, మాతృభాషపై మరింత విజ్ఞానం కలుగుతుందని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు

దేశభాషలందు తెలుగు లెస్స అన్న తెలుగు కవుల మాటలు అక్షర సత్యం అని వ్యాఖ్యానించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భం గా తెలుగులో నిర్వహించిన వివిధ పోటీల నిర్వహణ సందర్భంగా జరిపిన సభలో పిఓ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వివిధ అంశాల్లో పిల్లల ప్రదర్శనలు ద్వారా సాంప్రదాయాలు, కలలు ఎంత గొప్పవో కళ్ళకు కట్టినట్లు తేటతెల్ల మైందన్నారు.

భాషలో భావం ఉంటుందని, భాష పై పటు త్వం కోల్పోతున్న నేటి రోజుల్లో పిల్లలకు ఇటువంటి పోటీల నిర్వహణ ద్వారా తెలుగు భాషను కాపాడిన వాళ్ళం అవుతామని పిఓ పేర్కొన్నారు. ఇటువంటి పోటీలు నిర్వహిస్తే పిల్లల్లో మేధాశక్తి పెంపొందుతుందన్నారు తెలుగు భాష తియ్యనిది అని, దానిని స్ప ష్టంగా ఉచ్చరించినప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం బయటపడుతుందని వెల్లడించారు.

వివిధ అంశాల్లో గెలుపొందిన బాలభారతులకు గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మొదటి బహుమతి రూ 1500, రెండవ బహుమతి రూ 1000, మూడవ బహుమతి రూ 500, వ్యాసరచన క్విజ్ పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ 1000, రెండవ బహుమతి రూ 500, ఒక్క నిమిషం ప్రసంగంలో గెలుపొందిన వారికి మొదటి బహు మతి రూ 1000, రెండవ బహుమతి రూ 750, మూడవ బహుమతి రూ 250, కవితలు పద్యాలు ఉపన్యాసాలలో గెలుపొం దిన వారికి మొద టి బహుమతి రూ 1000, రెండవ బహుమతి రూ 500, డ్రామా, నాటికలలో మొద టి బహుమతి రూ 3000, రెండవ బహుమతి రూ 2000 నగదు పురస్కారం బహు మతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారినిలు మణెమ్మ, విజయలక్ష్మి, ఐటిడిఏ యూనిట్ అధికారు లు, ఆర్సిఓ గురుకులం అరుణకుమారి, ఏ సీఎంవోలు రమేష్ ,రాములు, ఏటీడీవోలు అశోక్ కుమార్, చంద్రమోహన్, రాధమ్మ, గురుకుల పాఠశాల, ఆశ్రమ పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.