డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు
గుంతను పూడ్చడం మరిచారు
రాజేంద్రనగర్, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి) : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని స్నేహిత హిల్స్ లో భూగర్భ డ్రైనేజీ లో చెత్త చెదారం పేరుకు పోయింది . దీంతో రోడ్డుపైకి మురుగునీరు వచ్చి కాలనీవాసులు దుర్వాసన భరించలేక బురద మయమైన రోడ్డుతో ఇబ్బందులు పడుతుండడం పై గత పది రోజుల క్రితం‘ సీఎం ఆదేశాలకు దిక్కెవరు.. రోడ్డుపైనే మురుగు పరుగు‘ అనే శీర్షికన విజయ క్రాంతి దినపత్రికలో కథనం ప్రచురితం కావడంతో వెంటనే స్పందించిన జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు జెసిబి సహాయంతో రోడ్డును తవ్వి అంతర్భాగంలో ఉన్న భూగర్భ డ్రైనేజీ కి మరమ్మతు చేసి సమస్యను పరిష్కరించారు.
రోడ్డుపై తీసిన గుంతను అధికారులు పూడ్చక పోవడంతో నడిరోడ్డుపై ఉన్న గుం త వల్ల స్నేహిత హిల్స్ కాలనీ ప్రజలు రోడ్డు ఇరుకుగా మారి రోడ్డు పై వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పాత సమస్యను పరిష్కరించి కొత్త సమస్యను సృ ష్టించినట్లు అయింది అధికారులు స్పందిం చి రోడ్డుపై ఏర్పడిన గుంతను పూడ్చి రోడ్డును ఎప్పటిలాగే వినియోగంలోకి తీసుకురావాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు..




