calender_icon.png 25 November, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితహిల్స్‌లో డ్రైనేజీకి మరమ్మతు

25-11-2025 12:00:00 AM

-గంటల వ్యవధిలోనే పరిష్కరించిన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ అధికారులు.

-తీరిన మురుగు దుర్వాసన సమస్య

బండ్లగూడ జాగిర్ నవంబర్ 24 ( విజయ క్రాంతి) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ వార్డులో నీ స్నేహిత హిల్స్ లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో చెత్తాచెదారం పేరుకుపోవడం తో మురుగునీరు రోడ్లపై పారుతుండటం వల్ల రోడ్డు పై మురుగునీరు ప్రవహిస్తున్నాడంతో పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడ్డాయి.. సోమవారం విజయ క్రాంతి దినపత్రికలో ‘ స్నేహిత హిల్స్ లోపించిన పారిశుద్ధం రోడ్డుపైనే మురుగునీరు పరుగు‘ అనే శీర్షికన వార్త ప్రచురితం అయింది అందుకు స్పందిం చిన బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏఈఈ రాజ్ కుమార్ అదెశాల మేరకు వర్క్ ఇన్స్పెక్టర్ కిరణ్ ట్యాంకర్ సహాయంతో పేరుకుపోయిన చెత్తను తొలగించారు . మురుగునీరు కాల్వలోనే ప్రవహించే విదంగా మరమ్మతు చేసి వ్యర్ధాలను తొలగించారు విజయ క్రాంతి దినపత్రికలో వార్త ప్రచురితం అయినా గంటల వ్యవధి లోనే సమస్య పరిష్కారం కావడం పై స్నేహిత హిల్స్ కాలనీ ప్రజలు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ అధికారులను అభినందించారు.