25-11-2025 12:00:00 AM
రడగంబాలబస్తీలో ఆక్రమణలు
చూసీచూడనట్టుగా అధికారులు
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 24: (విజయక్రాంతి) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ప్రభుత్వ ఖాళీ భూమి కనిపిస్తేచాలు కబ్జా చేయడమే తరువాయి పక్రియకు దిగుతారు. ఇదీ బెల్లంపల్లిలో ప్రభుత్వ భూముల దీనస్థితి. ఇదే కోవలోకి చెందిన భూ అక్రమణ ఘటన బెల్లంపల్లి మున్సిపల్ పరిధి అంబేద్కర్ నగర్‌లో చోటు చేసుకుంది.
మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ సమీపం లోని 170 పీపీ (ప్రభుత్వ) భూమిలో విశాలమైన ఖాళీ స్థలం ఉంది. అనుమతి లేకుం డా కొందరు ఈ స్థలాన్నీ ఆక్రమించుకొని తాత్కాలిక షెడ్లను వేశారు. ఈ అక్రమణల వెనుక అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ప్రోత్సాహం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు నివాస స్థలాలే ఇవ్వాల నుకంటే..
లీగల్ గా అధికారుల అనుమతి తీసుకుని దర్జాగా నివాసాల ను చేయవచ్చు కదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లోకి స్థానికులను రెచ్చగొట్టి అక్రమంగా నివాసాలకి సహకరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా యి. అక్రమంగా వెలిసిన నివాశాల విషయంలో ముడుపుల వ్యవహారం ఉండే ఉంటదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభు త్వ భూముల్లో అక్రమంగా షెడ్లు వేసినప్పటికీ అధికారులు మౌనం వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రభు త్వ భూములు కాపాడాల్సిన అధికారులు అక్రమా ర్కులపై ఎందుకు చర్యలకు దిగడం, అధికార పార్టీ నేతల జోక్యం ఉన్నదనే విమర్శలు ఉన్నా యి. పదుల సంఖ్యలో ప్రభుత్వ భూమిలో అక్రమ నివేశాలు వెలుస్తున్నాయి. రోజు రోజుకు వాటి సంఖ్య పెరిగి పోతున్నాయి.
ఇప్పటికైనా ప్రభుత్వ భూము ల్లో వెలిసిన అక్రమ షెడ్లను అధికారులు వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూములకు ఇప్పటికైనా అధికారులు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూముల రక్షణను గాలికి వదిలేసే అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా వ్యక్తమౌతున్నది. మరి అధికారులు ఏమి చేస్తారో, చేర్యలేమీ చేపడుతారో వేచి చూడాలి.