calender_icon.png 11 October, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హామీల్లానే 42 శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామా

11-10-2025 12:00:00 AM

ఈ ముఖ్యమంత్రికి పాలన తెలియదు.. అసలు అవగాహన లేదు

హనుమకొండ అక్టోబర్ 10 (విజయ క్రాంతి): పొద్దుగాల లేస్తే కేసీఆర్ను తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు తప్పా ఈ లిల్లీఫుట్ ముఖ్యమంత్రికి ఏం తెలియదని, బీసీ రిజర్వేషన్ ఒక డ్రామా అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. హనుమకొండ రాంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దయాకర్ రావు మాట్లాడుతూ ఈ బ్రొకర్ మాటలు గతంలో ప్రజలు నమ్మారు,కాని కోర్టులు నమ్మలేదు కాబట్టే హైకోర్టు గూబ గూయ్యి అనిపించిందని, రాష్ట్రంలో కనీసం ఇద్దరు మంత్రులు కలిసి తిరిగే పరిస్థితి లేదని,ఎవరి కుర్చీ ఎవరు లాక్కుంటారనే భయంతో మంత్రులు ఉన్నారన్నారు.

ఏ ఒక్క మంత్రి కూడా నియోజకవర్గంలో తిరగడం లేదు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకొలేక కొత్త డ్రామాకి తెరలేపిన కాంగ్రెస్ అని,స్థానిక ఎన్నికలు నిర్వహించలేకనే ఏదో కోర్టు ఆపింది మేము బిసిల కోసం అన్ని చేశాం అని చెప్పుకోవాలని కాంగ్రేస్ కుట్ర పన్నిందన్నారు. 55 ఏండ్లు కాంగ్రేస్ కేంద్రంలో అధికారంలో ఉండి బిసిల గురించి ఎందుకు పట్టించుకోలేదని, తూతూ మంత్రంగా జివో ఇచ్చి ఎన్నికలు నిర్వహించలేకనే ఇదంతా డ్రామా అని నిజంగా బిసిల పట్ల ప్రేమ ఉంటే రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాడండి. దానికి మేమంతా కలిసి వస్తామన్నారు.

ఈ ప్రభుత్వం 22 నెలలు అయింది అధికారంలోకి వచ్చి బిసిలకి ఏం చేసిందని, బిసి బంధు బందు పెట్టింది, చేప పిల్లల పంపిణీ బందు పెట్టింది, నాయి బ్రాహ్మణ, రజకుల ఉచిత విద్యుత్ బకాయిలు పెండింగ్ లో పెట్టింది. గొల్లకురుమలకు గొర్రెలు బందు పెట్టి ఇంకా ఏదో బిసిల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది అన్నారు.ఆనాడు ఈ రేవంత్రెడ్డి ఏమన్నారు. అసలు రాష్ట్రాలకి రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం నేరం అడుగితే జైల్లో పెట్టాలన్న ఈ రేవంత్రెడ్డిని మరి ఇప్పుడు ఏ జైల్లో పెట్టాలి అని ప్రశ్నించారు.

42 శాతం బిల్లు గవర్నర్ ఆమోదం పొందకుండా ఎన్నికలకు పోవటమే ఒక తెలివి తక్కువ పనిఅని, ఈ రిజర్వేషన్ ప్రక్రియ సరిగా అమలుకాకనే బిహర్ లో ఎన్నికలు ఆగిపోయాయని, మహరాష్ట్రలో ఎన్నికలు జరిగినా 18 రోజుల్లో ఎన్నికలు రద్దు అయ్యాయి. ఈ మాత్రం సోయి ప్రభుత్వానికి లేదా ?అని ప్రశ్నించారు. అయినా కూడా ఈ రిజర్వేషన్ చట్టం ఆమోదం పొందకుండా ఎన్నికలు నిర్వహించి, మళ్లీ ఆ ఎన్నికలు రద్దు అయితే నష్టపోయేది బిసి బిడ్డలు కాదా అన్నారు.

అంటే బిసిలను ఆర్ధికంగా నష్టపరచడమే మీ ప్రభుత్వ ధ్యేయమా అని ఎద్దేవ చేశారు. ఈ కాంగ్రెస్ అసమర్ధ పాలన వల్ల గ్రామాలు అన్ని అభివృద్ధిలో వెనకబడి ఉన్నాయని,22 నెలల పాలనలో గ్రామ పంచాయితీలకు ఈ ప్రభుత్వం ఒరగ బెట్టింది ఏం లేదుఅన్నారు.ఆనాడు కేసీఆర్  గ్రామాలు బాగుపడతేనే రాష్ట్రం బాగుంటుందని గ్రామ పంచాయితీలకు అధిక నిధుల ఇచ్చి అభివృద్ది చేస్తే.. ఈ ప్రభుత్వం ఆ గ్రామాల అభివృద్దికి అడ్డుగా నిలిచి గ్రామాలు ఆధ్వాన్న స్థితిలోకి వచ్చాయని,ఆనాడు అసెంబ్లీలోనే కేటిఆర్ ఈ 42 శాతం బిల్లుపై ఎలా ముందుకు వెళ్తారు అని అడిగితే సమాధానం చెప్పలేక ఇన్ని రోజులు కాలయాపన చేసి మేము బిసిల కోసం అన్ని చేసాం.కానీ కోర్టు ఆపింది ఆని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా అన్నారు.

ఈ జివో నిలబడదు అని ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ బిసిలను మభ్యపెట్టడానికే ఈ పనికి మాలిన పనులు చేసిందని,అభివృద్ది చేతగాక ఈ ప్రభుత్వం అమ్మకాలకు తెరలేపి ఆర్టీసీని సైతం ప్రైవేటికరణ చేసే కుట్ర జరుగుతుంది అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి 13 వందల 50 కోట్ల అప్పు చేసి ఆ అప్పును బస్సు చార్జీలు పెంచి ఆ కుటుంబంలోని మగవారిపై రుద్దుతున్నారని, గతంలో కేసీఆర్  2వేల కోట్లు ఆర్టీసీ బకాయిలు చెల్లించి అప్పుల్లో ఉన్నా ఆర్టీసిని అభివృద్దిలో నడిపిస్తే, ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఆర్టీసీని అమ్మెయాలని కుట్ర చేస్తోందన్నారు.

ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు కోపంగా ఉన్నారని, ఇంకా  ఇలాంటి పిచ్చి పనులు చేసి వారి సహనాన్ని పరిక్షీస్తే ఉరికించి కొడతారు అన్నారు.తస్మాత్ జాగ్రత్త,ముందు 42 శాతంపై చట్టల తీసుకురండి. దీనికి మేమంతా కలిసి వస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో  స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ,మాజీ ఎమ్మెల్యేలు ఓడితెల సతీష్ బాబు, శంకర్ నాయక్  పాలకుర్తి నియోజకవర్గం, మరియు వర్ధన్నపేట నియోజకవర్గం లోని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.