26-07-2025 11:41:41 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్(District President Bairi Shankar Mudiraj) అన్నారు. శనివారం దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రంలో బీజేపీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికలలో హామీచ్చి ఇప్పుడు బీజేపీ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ముందు బీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో సీఎం పదవి నుంచి అమలు చేయాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తప్పుకొని బీసీలకు అవకాశం ఇవ్వాలన్నారు. వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు.
గత పది యేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారాని ప్రస్తుతం ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటకే పరిమితమైందన్నారు. గత 11 ఏళ్లుగా దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రచారం చేస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వ్యతిరేకతను ప్రజలకు వివరిస్తూ మండలంలో అధిక స్థానాలు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు గెలిపే లక్ష్యంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు పనిచేద్దామని దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కన్వీనర్ కనకయ్య, మండలాల ఎన్నికల ప్రభారిలు వెంకట్ గౌడ్, గోవింద్,మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నర్సింహారెడ్డి, మంకిడి స్వామి, మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు నీల స్వామి,గణేష్, మాజీ మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, కిషన్, రాజా గౌడ్, శక్తి కేంద్ర ఇంచార్జ్ లు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.....