తుపాకీతో బెదిరించి..

29-04-2024 01:14:20 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మూన్‌షైన్ పబ్‌లో శనివారం అర్ధరాత్రి మందుబాబులు హల్చల్ చేశారు. తుపాకీతో బెదిరించి, బీరు బాటిళ్లతో దాడిచేసి ముగ్గురు యువకులను గాయపర్చారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పబ్‌లో పీకల దాకా మద్యం తాగిన కొందరు ఆకతాయిలు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. యువతితో డ్యాన్స్ చేస్తున్న యువకుడిని అడ్డుకుని, ఆమెతో తాము డ్యాన్స్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. దీంతో గాయపడిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.